Take a fresh look at your lifestyle.

శేరిలింగంపల్లి ప్రజావాణిలో 24 ఫిర్యాదులు

 
ముద్ర, శేరిలింగంపల్లి 

శేర్లింగంపల్లి జోన్ వ్యాప్తంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది. జోనల్ కార్యాలయం తోపాటు నార్సింగ్ ,అమిన్పూర్ , పటాన్చెరువు, మియాపూర్ శేరిలింగంపల్లి సర్కిల్లో అధికారులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కాగా మొత్తం 24 వినతులు అధికారులకు అందాయి .ఇందులో జోనల్ కార్యాలయంలో 5, శేర్లింగంపల్లి, సర్కిల్ కార్యాలయంలో 8, నర్సింగ్ సర్కిల్ కార్యాలయంలో 3 , మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో 5 మరియు అమెన్పూర్ సర్కిల్ 3 చొప్పున వినతులు వచ్చాయి. ఇందులో పట్టణ ప్రణాళిక, పన్ను విభాగం, ఇంజనీరింగ్ కు సంబంధించి సమస్యలను ప్రజలు వినతిపత్రం రూపంలో అందించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన వినతులపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు .అత్యంత ప్రాధాన్యతగా భావించి క్షేత్రస్థాయి పరిశీలనలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి తీసుకున్న చర్యలను తిరిగి ప్రజలకు నివేదించాలని జోనల్ కమిషనర్ సూచించారు. జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే ఆయా విభాగాల అధికారులతో కలిసి ప్రజావాణిలో వినతులను స్వీకరించారు.

Leave A Reply

Your email address will not be published.