Take a fresh look at your lifestyle.

20న కేబినెట్ భేటీ అసెంబ్లీ కమిటీ హాల్ లో బడ్జెట్ ఆమోదం ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రాష్ట్ర మంత్రివర్గ ఈ నెల 20న భేటీ కానుంది, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‍లో ఉ.9.30 గంటలకు సమావేశం కాబోతోంది. ఈ భేటీకి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు దానికి మంత్రివర్గ ఆమోదం తెలపడం ఈ సమావేశం యొక్క ప్రధాన అజెండాగా ఉంది. దీంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటిపోతున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్ లో ఎలాంటి పథకాలు ఉండబోతున్నాయి? అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.