Take a fresh look at your lifestyle.

కాప్రా లో ఘనంగా హనుమాన్ జయంతి

 

ముద్ర : కాప్రా

హనుమాన్ జయంతి సందర్భంగా కాప్రా హెచ్.పీ కాలనీ నాచారం మల్లాపూర్ చర్లపల్లి కుషాయిగూడ పరిధిలోని పలు హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్, పలు ఆంజనేయ స్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఈ సందర్భగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.
శ్రీ హనుమంతుడు భక్తి, శక్తి, ధైర్యానికి ప్రతీక. హనుమాన్ జయంతి అంటే మనసుకు, శరీరానికి శక్తి, ధైర్యం, నిబద్ధతను ఇచ్చే పర్వదినం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే గుణానికి ఆంజనేయుడే నిదర్శనం. హనుమాన్ జయంతిని అందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.
అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేసే కార్యసాధకుడు.భయాలను పోగొట్టి ధైర్యాన్ని నింపే అభయాంజనేయుడు.
ఆ వాయుపుత్రుని ఆశీస్సులతో ప్రజలందరికీ విజయం, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ఆయన అన్నారు.

Leave A Reply

Your email address will not be published.