Take a fresh look at your lifestyle.

మేధావులు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి

ముద్ర, శేరిలింగంపల్లి:

ఉన్నత విద్యనభ్యసించిన మేధావివర్గం దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం శేరిలింగంపల్లి నియోజవకర్గంలోని లక్ష్మి ఇన్ఫీరియా ఫ్లాట్ ఓనర్స్ అపార్ట్మెంట్ వాసులతో జరిగిన చిట్ చాట్ లో చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, భాజపా శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ తో కలిసి ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మేధావులు, విద్యావంతులు దేశ అభివృద్ధి కోసం వికసిత్ భారత్ లక్ష్యం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మీ సంపూర్ణ మద్దతు ఉంది, రాష్ట్రంలో, మన డివిజన్ లో, మన బూత్ లో కూడా బీజేపీ విజయం సాధించేలా మీ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని వారిని కోరారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చెయ్యాలి తప్ప అభివృద్ధిలో అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీలాంటి చదువుకున్న ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధి కి ,సమాజంలో మార్పు కొరకు మీ సహకారం ఉండాలని, 12 ఏళ్ల క్రితం దేశం ఆర్థికంగా 12 వ స్థానంలో ఉండగా ప్రస్తుతం నాల్గవ స్థానంలో ఉన్నామని, 2014 లో మన ఎకనామి రూ.106.57 లక్షల కోట్లు ఉండగా ఇప్పుడు 2025 నాటికి రూ331.03 లక్షల కోట్లనీ ఎంత గొప్పగా దేశం అభివృధి చెందిందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని గుర్తుచేశారు. మోదీ దేశాన్ని శక్తి వంతమైన దేశం గా మార్చారని, మన సిద్ధాంతం ఎప్పుడూ సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అని, ప్రతి వర్గానికీ అభివృద్ధి, ప్రతి కుటుంబానికి భద్రత, ప్రతి యువకునికి అవకాశాలు అందించాలన్నదే మా లక్ష్యమని, డిజిటల్ ఇండియా, స్టార్ట్-అప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా, మేకిన్ ఇండియా, వికసిత్ భారత్ లక్ష్యం గాస్వదేశీ వస్తువులను తయారీ, నగరాల్లో మంచి త్రాగు నీరు అందించడానికి అమృత 2.0, పరిసరాల శుభ్రతకు స్వచ్ఛ భారత్ ఇలా అనేక కార్యక్రమాల ద్వారా దేశ అభివృద్ధికి కృషి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ గుర్తుచేశారు. కమ్యూనిటీ వాసులు మెరుగైన రహదారులు, పిల్లల కోసం ఆట స్థలానికి బౌండరీ ఏర్పాటు, ట్రాఫిక్ సమస్య, ఆలయ నిర్మాణం, సీనియర్ సిటిజన్లకు సౌకర్యాలు, అందుబాటులో విద్య ఇలా పలు సమస్యలు దృష్టికి తీసుకురాగా ఇవన్నీ ప్రభుత్వంతో మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని నియోజకవర్గ ఇన్ ఛార్జ్ రవికుమార్ మాట్లాడుతూ హామీ ఇచ్చారు, అలాగే మీ అందరి సహకారాలు, సూచనలు, ఆశీర్వాదాలు ఉంటే మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు శివ నరసింహ రాజు, సుబ్బారావు, శంకర్ ,ఆనంద్, నవీన్ రెడ్డి ,మధుకర్ రెడ్డి, మరియు,భారతీయ జనతా పార్టీ నాయకులు రాఘవేందర్ రావు, నాగుల్ గౌడ్, సీతారామరాజు మాణిక్ రావు,లక్ష్మణ్ ముదిరాజ్,పట్టాభిరామ్, మాన్యం, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.