Take a fresh look at your lifestyle.

పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు సముచిత స్థానం-. తాండూర్ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజ్

 

ముద్ర, తాండూర్ ప్రతినిధి :

పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్త కూడా సముచిత స్థానం లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు తెలిపారు. బుధవారం రోజున మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో
మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.
కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోబడిన సభ్యులు
1.మేన్గారి సుభాష్ (15వ వార్డు)
2.మహమ్మద్ రహీం (10వ వార్డు)
3.చినోళ్ల సరిత హరి గౌడ్ (13వ వార్డు)
4.ఆప్రిన్ జవేరియా అన్వర్ అమ్మద్ ఖాన్ (17వ వార్డు)
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ వారిని కో ఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని, రాబోయే రోజుల్లో కూడా పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత నిస్తుందని ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.