Take a fresh look at your lifestyle.

వేగంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేసవి జాగ్రత్త లు తీసుకోండి కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మిక తనిఖీ

ముద్ర ప్రతినిధి, మెదక్:
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరగాలని,,రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్ర నిర్వాహకులు, సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. సోమవారం హవేలీ ఘన్పూర్ మండల కేంద్రంలోని ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంను
కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ధాన్యం కొనుగోలు వివరాలు, అందుబాటులో ఉన్న టార్ఫాలిన్లు, గన్ని బ్యాగులు, కొనుగోలు చేసిన ధాన్యం, మిల్లులకు తరలింపు తదితర వివరాలను నిర్వాహకులని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలులో మరింత పుంజుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 880 మంది రైతుల నుండి 4270 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, 38 మంది రైతులకు 42 లక్షల రూపాయలు అకౌంట్లో
జమ చేశామన్నారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫిగా సాగేందుకు మూడు దశల్లో టోకెన్ పద్దతిని పెట్టడం జరిగిందన్నారు. ఆయా శాఖల అధికారులు తు.చ తప్పకుండ పాటించాలని, తద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తేమ శాతం వచ్చిన ధాన్యం వేగంగా కొనుగోలు అవుంతుందన్నారు.
కొనుగోలు ప్రక్రియ పూర్తి కాగానే వెంటనే ట్యాగ్ చేసిన మిల్లులకు ధాన్యం బస్తాలను తరలించాలన్నారు. రవాణా పరంగా కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా అవసమైన లారీలను నిర్వాహకులు కేంద్రాలకు సరైన సమయంలో వచ్చేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు. ఎండల నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, టోకెన్ ల ఆధారంగా కేంద్రాలకు రావాలన్నారు.
కేంద్రాలలో తాగు నీరు, నీడ తదితర మౌలిక వసతులు ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ తెలిపారు. వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్, సివిల్ సప్లై మేనేజర్ జగదీష్, తహసిల్దార్ సింధు రేణుక తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.