Take a fresh look at your lifestyle.

మంత్రి వర్గ విస్తరణలో మున్నూరు కాపులకు అన్యాయం

  • జగిత్యాల జిల్లా అధ్యక్షులు చెదలు సత్యనారాయణ.

కోరుట్ల, ముద్ర విలేకరి:  మంత్రి వర్గ విస్తరణలో మున్నూరు కాపులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ మున్నూరు కాపు సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ చెదలు సత్యనారాయణ ఆద్వర్యంలో కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్డు హనుమాన్ దేవాలయం నుండి నంది చౌక్, గాంధీ రోడ్డు, వెంకటేశ్వర స్వామి దేవాలయం, గడి బురుజు, డైమండ్ హోటల్, కొత్త బస్టాండ్, కార్గిల్ చౌక్ మీదుగా నంది చౌక్ వరకు నిర్వహించిన అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో మున్నూరు కాపులకు జరిగిన అన్యాన్ని నిరసిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాలని మున్నారు కాపుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ చెదలు సత్యనారాయణతో పాటు, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం వేణు గోపాల్, మున్నూరు కాపు వివిధ సంఘాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.