Take a fresh look at your lifestyle.

రేవంత్.. రైతులపై ప్రేమ ఇదేనా..?

  • సీఎంకు మార్కెట్​ యార్డులకు వెళ్లే తీరక లేదు.
  • ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు గోస పడుతున్నరు.
  • రాష్ట్రంలో జనుము, జీలుగు విత్తనాల కొరత ఉంది.
  • సీఎం రేవంత్​ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్​.

ముద్ర, తెలంగాణ బ్యూరో : అందాల పోటీలకు ఐదు సార్లు వెళ్లిన సీఎం రేవంత్​ రెడ్డికి రైతులను కలిసేందుకు సమయం లేదని బీఆర్​ఎస్​ మాజీ మంత్రి హరీశ్​ రావు ఆరోపించారు. అందాల భామలను చూసేందుకు టైమ్ ఉంది కానీ.. ఒక్కసారనా జిల్లాల్లో మార్కెట్ యార్డులకు వెళ్లి అధకారులు వడ్లు ఎందుకు కొనట్లేదని ప్రశ్నించే సమయం లేదా అని నిలదీశారు. ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్​ లో ఆయన మీడియాతో మాట్లాడారు. జనుము, జీలుగు విత్తనాలు ఎందుకు దొరకడం లేదంటూ అన్నదాతల కష్టాలను అడిగి తెలుసుకునేందుకు సీఎంకు తీరిక లేదన్నారు. అందాల పోటీల్లో పొల్గొనేందుకు విదేశాల నుంచి వచ్చిన మహిళల పట్ల కాంగ్రెస్ నాయకులు అనుచితంగా ప్రవర్తించారని హరీశ్ రావు ఆరోపించారు. వారి చేష్టలతో దేశ ప్రతిష్టతో పాటు రాష్ట్ర పరువు గంగలో కలిసిందని ఆక్షేపించారు. వేధింపులకు గురైన మహిళ ఎంతలా బాధిపెడితే.. అలా పోటీలోంచి వైదొలిగిపోయి ఉంటుందని హరీశ్ రావు అన్నారు. మార్పు మార్పు అంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ పార్టీ.. ఏకంగా ఉద్యమంలో స్ఫూర్తినిచ్చిన తెలంగాణ తల్లినే మార్చేసిందని మండిపడ్డారు. తల్లిని మార్చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక మరో తల్లి ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికార చిహ్నంలో ఇదే రేవంత్ రెడ్డి ఓసారి కాకతీయ తోరణాన్ని తీస్తానంటాడని.. మరోసారి చార్మినార్ బొమ్మను లేపేస్తా అంటాడని ఆయన సెటైర్లు వేశారు.

Leave A Reply

Your email address will not be published.