మహిళల భద్రత కు ప్రాధాన్యం, వేధింపులపై డయల్ 100 ఫోన్ చేస్తే బాధితుల ఇంటి నుండే కేసు నమోదు.ఎస్పి. నరసింహనా ఐపీఎస్…….
ముద్ర. నడిగూడెం…..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేరరహిత సమాజ నిర్మాణం, పౌరుల బాధ్యత, మహిళల భద్రత, సైబర్ మోసాల నివారణపై బుధవారం సూర్యాపేట జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో నడిగూడెం మండల పరిధిలోని వల్లాపురం గ్రామంలో సైబర్ నేరాల అవగాహన సదస్సు కు జిల్లా ఎస్పీ హాజరైనారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేరరహిత సమాజ నిర్మాణం, పౌరుల బాధ్యతకు సంబంధించిందని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. బినాన్స్, క్రిప్టో కరెన్సీ లాంటి డిజిటల్ మనీ మార్పిడిలో జాగ్రత్తలు పాటించాలని అత్యాశకు వెళ్లి సైబర్ మోసగాళ్లకు చిక్కుకొని సైబర్ నేరాల్లో చిక్కుకోవద్దని హెచ్చరించారు, డిజిటల్ కరెన్సీ మార్పిడి చేసే విషయంలో అధిక డబ్బు సంపాదించాలనే అత్యాశకు పోయి చాలామంది యువత సైబర్ మోసగాళ్ల ద్వారా డబ్బును పొంది సైబర్ నేరాల్లో చిక్కుకున్నారని తెలిపారు. ప్రస్తుత సమాజానికి డ్రగ్స్ అనే చీడపీడ పట్టిందని ఈ డ్రగ్స్ నిర్మూలించకపోతే సమాజంలో నేరప్రవృత్తి పెరుగుతుందని, పౌరులు డ్రగ్స్ మత్తుకు బానిసలై జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారని తెలిపారు, డ్రగ్స్ ను మన సమాజం నుండి ప్రారదోలాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. పిల్లల నడవడికను తల్లిదండ్రులు గమనించాలి అని తప్పుడు మార్గంలో వెళ్లే పిల్లలను తల్లిదండ్రులు మందలించాలి అన్నారు.అజాగ్రత్తగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురికా వద్దని,. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి అని రహదారులపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపవద్దు,అని ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వారు హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అని కోరారు. రాష్ట్ర పోలీసు ప్రతిష్టాత్మకంగా అరైవ్ అలైవ్ అనే రోడ్డు భద్రత కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం అని అన్నారు.మహిళల భద్రతకు పోలీసు శాఖ అధిక ప్రాధాన్యం ఇస్తుంది అని పని చేస్తున్న మహిళలను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. వేధింపులపై డయల్ 100 కు ఫోన్ చేస్తే పోలీసులు బాధితుల ఇంటి వద్దకు వెళ్ళి పిర్యాదు స్వీకరించి బాధితుల ఇంటి వద్దనే కేసు నమోదు చేస్తాం అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరిత కోదాడ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి,సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మి నారాయణ, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, నడిగూడెం ఎస్ఐ అజయ్ కుమార్, మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్, కోదాడ ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ రామాచారి, పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, యువత, మహిళలు పాల్గొన్నారు