Take a fresh look at your lifestyle.

మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం దుర్మార్గం

ముద్ర, తాండూర్:

చట్టసభల్లో మహిళలకు అధికారం కల్పించాలని ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ 33 శాతం రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ కూటమి నేతలు ఆ బిల్లును వ్యతిరేకించారంటే కాంగ్రెస్ పార్టీకి దేశంలోని మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఎలా ఉందో ప్రతి ఒక్కరు గ్రహించాలని తాండూర్ పట్టణ బిజెపి కౌన్సిలర్లు పేర్కొన్నారు.
మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శనివారం రోజున బిజెపి కౌన్సిలర్లు నాగారం మల్లేశం అంతారo కిరణ్ శ్రీకాంత్ రెడ్డి మహిళా బిల్లుకు ఆమోదం పొందనందుకు నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఏప్రిల్ 17 2026 ఒక చీకటి దినం అని వారు పేర్కొన్నారు
కాంగ్రెస్ మరియు ఇండియా కూటమి మరోసారి తమ మహిళా వ్యతిరేక నైజాన్ని చాటుకుంటూ, మా మహిళల పట్ల క్షమించరాని నమ్మకద్రోహానికి పాల్పడ్డాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేసిన పార్టీలను దేశ మహిళలు క్షమించకూడదు వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.