Take a fresh look at your lifestyle.

భగత్ సింగ్ స్పూర్తితో నేటి యువత పని చేయాలి

 

ముద్ర కాప్రా

భగత్ సింగ్ స్పూర్తితో డ్రగ్స్, గంజాయి, మాధకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతామని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర లు తెలిపారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో యువజనోత్సవాల గోడ పత్రిక ను బుధవారం విడుదల చేశారు.
దేశం కోసం ప్రాణాలర్పించిన షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 95వ వర్ధంతి సందర్భంగా అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువజనోత్సవాలను (స్టాప్ డ్రగ్స్ -స్టాప్ స్పోర్ట్స్, క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ పోటీలు,వ్యాసరచన, చిత్రలేఖన,ఉపన్యాస పోటీలు, రక్తదాన శిబిరాలు,యువ కవి, గాయకుల సమ్మేళనం,సాంస్కృతిక కార్యక్రమాలు,ప్రముఖుల సందేశాలు) మార్చ్ 1-23 వరకు నిర్వహించనున్నామని వారు తెలిపారు.

షహీద్ భగత్ సింగ్,రాజ్ గురు, సుఖ్ దేవ్ లు దేశ స్వాతంత్య్రం కోసం ఉరికొయ్యలను సైతం లెక్కచేయకుండా, భవిష్యత్తు తరాల కోసం బ్రిటీష్ ముష్కరులను ఎదిరించి వీరోచిత పోరాటాలు చేసి వీరమరణం పొందరన్నారు. కానీ, భగత్ సింగ్ కలలుగన్న స్వరాజ్య ఆకాంక్షలకు అనుగుణంగా నేటి విద్యార్థులు,యువత పయనుంచడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దేశానికే ఆదర్శప్రాయుడైన భగత్ సింగ్ స్పూర్తితో నేటి యువత చెడు మార్గాలను,చెడు అలవాట్లను విడనాడాలని వారు పిలుపునిచ్చారు. కుల,మతాలకు అతీతంగా ధనిక, పేద తారతమ్యాలు లేని, అవినీతి రహిత సమసమాజ స్థాపన కలలుకన్నాడని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్,ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ బిజ్జ శ్రీనివాసులు, టి.సత్య ప్రసాద్, పేరబోయిన మహేందర్, యుగంధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్ మహమూద్, సల్మాన్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.