Take a fresh look at your lifestyle.

సన్నబియ్యం పంపిణీ ప్రారంభం

మంథని, ముద్ర: మంథని మండలంలోని లక్కేపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ, మంథని మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్  ఆధ్వర్యంలో మంగళవారం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు.ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం పంపిణీ పథకం ప్రవేశపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పౌరసరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమర్ రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్  అద్యక్షుడు మంథని రాకేష్, గ్రామశాఖ అధ్యక్షులు ఈసంపల్లి శ్రీనివాస్, మైనార్టీ సెల్ మండల వైస్ ప్రెసిడెంట్ ఎండి సల్మాన్, పాక్స్ డైరెక్టర్ కొత్త శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుంజపడుగ కుమార్, చాంద్ మియ, ఎస్సీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షులు ఆరెల్లి శ్రీధర్, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పండుగ సన్ని, ఎండి ఫహీం, కొత్త రంజిత్, అరుణ్, మహేష్, స్నేహిత్ కిరణ్ ,ఆకాష్ ,లోకేష్, శ్రీకాంత్, గ్రామ శాఖ నాయకులు ఎరుకల ఎల్లయ్య మహిళలు కొత్త జ్యోతి, అష్మతి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.