Take a fresh look at your lifestyle.

బహుజనుల విప్లవ కెరటం కామ్రేడ్ మారోజు వీరన్న

  • కొత్తగూడెంలో కామ్రేడ్ మారోజు వీరన్న స్తూపం వద్ద కామ్రేడ్ మారోజు వీరన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే మందుల సామేలు.
  •  కొత్తగూడెంలో  కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపం వద్ద మాట్లాడుతున్న ఎమ్మెల్యే మందుల సామేలు.

ముద్ర,తుంగతుర్తి: బహుజనుల విప్లవ కెరటం కామ్రేడ్ మారోజు వీరన్న అని ఎమ్మెల్యే  మందుల సామేలు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కొత్తగూడెం వద్ద మారోజు వీరన్న 26 వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడుతూ కామ్రేడ్ మారోజు వీరన్న 1999 మే 16 సంవత్సరంలో ఆనాటి టీడీపీ చంద్రబాబు ప్రభుత్వం బూటకపు ఎన్ కౌంటర్ చేసి రాజకీయ హత్య చేయడం జరిగిందని అన్నారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా చిన్న రాష్ట్రాల వల్లే అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయని, బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందని చెప్పిన ఉద్యమ కెరటం మారోజు వీరన్న అన్నారు.వీరన్న కన్న కలలు సాకారం అయినప్పుడే మనమంతా వీరన్నకిచ్చే ఘన నివాళి అని పేర్కొన్నారు.దేశంలో విప్లవం విజయవంతం కావాలంటే కుల, వర్గ జమిలి పోరాటాల ద్వారానే విజయవంతం అవుతుందని చెప్పిన ఒకే ఒక్క వ్యక్తి మారోజు వీరన్న అని కొనియాడారు. వీరన్న విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మారోజు వీరన్న సతీమణి మారోజు చైతన్య, కూతురు మారోజు దిశ, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ కిషన్ రావు, మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, పూసపల్లి బిక్షం, మల్లేష్ ,రామచంద్రు, పరమేష్ వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.