మీసేవ సర్వీస్ చార్జెస్ పెంపు పై ప్రజల సహకరించాలి
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చార్జీల పెంపు అమల్లోకి వచ్చింది
మీసేవ ఆపరేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన అర్బన్ ఎమ్మార్వో
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మీసేవ కేంద్రాలు పనిచేస్తాయని రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చార్జీల పెంపు అమల్లోకి వచ్చిందని సిద్దిపేట అర్బన్ ఎంఆర్ఓ రవికిరణ్ తెలిపారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అర్బన్ ఎమ్మార్వో కార్యాలయంలో మీసేవ సర్వీసు ఆపరేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీసేవ కేంద్రాలలో సర్వీస్ యూజర్ చార్జీలు రాష్ట్ర ప్రభుత్వం పెంచడంతో ప్రజలు ఈ కొత్త చార్జీల గురించి తెలుసుకుని, మీసేవ కేంద్రాల సేవలను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. పారదర్శకంగా నిబద్ధతతో ప్రజలకు సేవ చేయడానికి మీసేవ కేంద్ర నిర్వాహకులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజల సహకారంతో మీసేవ కేంద్రాలు సేవలను మరింత మెరుగుపరుచుకోవడానికి దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మీసేవ యూనియన్ అధ్యక్షుడు గందే నాగరాజు, ఆడెపు మహేష్, ఫెరోజ్, భరత్, శ్రీకాంత్, మహేశ్వర్ రెడ్డి, కిషన్ రెడ్డి తదితర మీసేవ ఆపరేటర్లు పాల్గొన్నారు.