- ఎలక్ట్రిసిటీ కొనుగోళ్ళు, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏమయ్యాయి?
- కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మూడు నెలల్లో అని ఏడుసార్లు పొడిగించారు.
- రేవంత్ రెడ్డి వేసిన కమిషన్లపై జనాలకు నమ్మకం లేదు.
- ఫోన్ ట్యాపింగ్ అనేది నిజం.
- రాష్ట్రంలో అప్పుల బాధ పోవాలంటే బీజేపీ రావల్సిందే.
- ఎంపీ ఈటల రాజేందర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఏదో జరిగిపోయిందని, అధికారంలోకి రాగానే పది రోజుల్లో అవినీతిపరులను జైలుకు పంపిస్తామని ఇచ్చిన వాగ్ధానం ఏమైందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నిలదీశారు. ఎలక్ట్రిసిటీ కొనుగోలు, ఈకార్ రేస్, ఫోన్ ట్యాపింగ్ సహా ఏ కేసులను తేల్చలేదని ఆయన దుయ్యబట్టారు. కాళేశ్వరం కమిషన్ మూడు నెలల్లో ఇస్తానన్న రిపోర్టును ఏడుసార్లు పొడిగించారని ఆయన ఆరోపించారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి వేసిన కమిషన్ల మీద జనాలకు నమ్మకం లేదని ఎంపీ ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. ఫోన్ టాపింగ్ అందరూ అంగీకరించిందేనని అన్నారు. తన ఫోన్‌తో పాటు తన భార్య, కుమారుడు, కోడలి, చివరకు డ్రైవర్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని ఆయన దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ పై వాస్తవం ఏమిటనే విషయాన్ని త్వరగా తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నల్గొండలో మీడియాతో ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడారు.. తెలంగాణ దివాలా తీసినట్లుగా , అప్పుల పాలైనట్లుగా, అధికారులను చూస్తే చెప్పులు ఎత్తుకొని పోయేలా చూస్తున్నారని ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడటం రేవంత్ రెడ్డి సిగ్గుమాలిన పని అని ఆయన దుయ్యబట్టారు. ఈ అప్పుల ఊబి నుండి బయటపడి గొప్పగా అభివృద్ధి చెందాలంటే తప్పకుండా తెలంగాణలో కూడా రావాల్సిన ప్రభుత్వం బీజేపీ అని ప్రజలు అనుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ బ్రోకర్ మాటలు నమ్మకుండా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని ఆదరించాలని ప్రజలను కోరుతున్నానని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు రావాలంటే 10% కమిషన్ తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అతి తక్కువ కాలంలో ప్రజల చేత ఛీ కొట్టించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమేనని అన్నారు. దేశ సంపదే తన సంపదగా, దేశ ఎదుగుదలే తన ఎదుగుదలగా ప్రధాని మోడీ భావించి పనిచేస్తున్నారని అన్నారు. 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతను నాలుగవ ఆర్థిక వ్యవస్థగా నిలిపిన ఘనత మోడీది అని అన్నారు. అమెరికా, రష్యా, సౌదీ అరేబియా ఎక్కడికి వెళ్లినా మోడీకి రెడ్ కార్పెట్ వేస్తున్నారని అన్నారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి ఉంటుంది అనేది మోడీ నమ్మకమని అన్నారు. మోడీ వచ్చిన తర్వాత ఎరువులు, విత్తనాల కొరత లేదన్నారు. రైతే దేశానికి వెన్నుముకగా భావించి ఎగరానికి 6000 చొప్పున ఆర్థిక సాయం అందించారన్నారు.