ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రపంచంలో అతి పురాతనమైంది హిందూ మతమని, నాగరికతకు పట్టుకొమ్మ అని మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. హిందూ సమ్మేళనం పట్టణంలోని మున్నూరుకాపు సంఘ భవనంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ మాట్లాడుతూ ప్రపంచంలో మొట్టమొదటి మతం హిందూ మతమని చరిత్ర చెబుతుందన్నారు. నాటి నుండి నేటివరకు హిందూ మతాన్ని ఎవరూ ఏం చేయలేకపోయారన్నారు. మన ధర్మమే మనకు రక్షణగా ఉంటుందన్నారు.హిందూ మతాన్ని మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ప్రతి దేశంలో హిందూ మత సంప్రదాయాలను విశ్వసించేవారు ఎందరో ఉన్నారన్నారు. మనం ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడే మన ధర్మాన్ని కాపాడుకున్న వాళ్లమౌతామని అన్నారు.