Take a fresh look at your lifestyle.

పదోన్నతి పై వెళ్తున్న కమాండెంట్ యోగేష్ ని సన్మానించిన జిఎం

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: పదోన్నతి పై వెళ్ళుతున్న కమాండెంట్ (సి.ఐ.ఎస్.ఎఫ్) యోగేష్ పర్మర్ ని మంగళవారం జిఎం కార్యాలయంలో ఆర్.జి 1 ఏరియా జియం డి.లలిత్ కుమార్ వివిధ శాఖల ఉన్నత అధికారులు మర్యాధ పూర్వకంగా కలిసి వారి పదవి కాలం సింగరేణి అర్జీ 1 ఏరియాకు ఉన్న అనుభవాలను పంచుకోవటం జరిగింది. జిఎం కార్యాలయంకు విచ్చేసిన వారిని జిఎం శాలువాతో సత్కరించి వారికి పుష్ప గుచ్చెం అందించి వారి అనుభవాలను పంచుకున్నారు.వారి పదవీకాలం లో ఆర్ జి 1 ఏరియా సింగరేణికి సంబందించిన పలు విషయాలను గుర్తు చేసుకున్నారు.సింగరేణి ఆస్తులను కాపాడటంలో వారి కృషి ని కొనియాడారు.ఈ కార్యక్రమంలో యస్.ఓ.టు జిఎం గోపాల్ సింగ్,అధికారులు చంద్ర శేఖర్,వెంకటేశ్వర్ రావు, కిరణ్ బాబు,రమేష్,ఆంజనేయ ప్రసాద్,అనిల్ గబాలే,కుమార స్వామి,ధనలక్ష్మి బాయి,మోహన్ రావు,రవీందర్ రెడ్డి,వీరారెడ్డి, సాంబ శివరావు,బీమా,వర వరప్రసాద్ ఇతర అధికారులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.