Take a fresh look at your lifestyle.

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

  • రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి
  • ప్రతి ఇసుక రీచ్ వద్ద 360 డిగ్రీల కెమెరాల ఏర్పాటు
  • ఇసుక సరఫరా పాలసీపై వీడియో కాన్ఫరెన్స్
  • ఇందిరమ్మ ఇండ్లకు ఉచితం
  • సామాన్యులకు తక్కువ ధరకు

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: ఇసుక రవాణాను అధికారులు కట్టుదిట్టంగా మానిటరింగ్ చేయాలని,ప్రత్యేక అధికారులను నియమించాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.బుధవారం ఇసుక పాలసీ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షీంచారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ వేణు, డిసిపి ఎం.చేతనలతో పెద్దపల్లి కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ ఇసుక రీచ్ ల వద్ద తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ ఇసుక రవాణా నివారణకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.పేదల నిర్మించుకునే ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు.సామాన్య ప్రజలకు అతి తక్కువ ధరకు ఇసుక అందుబాటులోకి రావాలని, ఇసుక సరఫరా చేసే ట్రాక్టర్లు,లారీలను ఎంపానల్ చేయాలని, ఇసుక బుక్ చేసిన 48 గంటల వ్యవధిలోగా వినియోగదారుడికి చేరేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని,నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఇసుక రవాణా జరిగే వాహనాల ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేసి అక్రమ రవాణా కు అడ్డుకట్ట వేయాలని అన్నారు.ఇసుక రీచ్ ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు, లైట్స్ ఏర్పాటు చేయాలని,ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్ తో పాటు ఎంట్రీ ఎగ్జిట్లను ఏర్పాటు చేయాలని,ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని,బ్లాక్ మార్కెట్ అరికట్టి పేదలకు ఇసుకను అందుబాటులో ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఆన్లైన్ బుకింగ్ విధానంలో మార్పులు జరగాలని,ఆఫీస్ టైమింగ్స్ సమయంలో బుకింగ్ చేసుకునేలా బుకింగ్ వేళలో మార్పులు చేయాలని అన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఇసుక రీచ్ ల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అవసరమైన కెమెరాలు ఏర్పాటు, స్టాక్ యార్డుల వద్ద ఎంట్రీ,ఎగ్జిట్ ఏర్పాటు చేస్తామన్నారు.ఈ సమావేశంలో అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ శ్రీనివాస్,ఆర్టీవో రంగారావు,మంథని ఆర్డీవో సురేష్,గోదావరిఖని ఏసీపీ రమేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.