Take a fresh look at your lifestyle.

నర్సింగాపూర్ లోని ప్రభుత్వ భూములను రక్షించాలి…. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలి… అదనపు కలెక్టర్ కు బీజేపీ నాయకుల వినతి…

 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

నర్సింగాపూర్ లోని ప్రభుత్వ భూములను రక్షించాలని, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా అదనపు కలెక్టర్ రాజగౌడ్ కు బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నర్సింగాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 437, 251లో ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసుకొని ఆ ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. సాధారణంగా ఇటుక బట్టీలు నిర్వహించాలంటే నాలా కన్వర్షన్, ఇతర ప్రభుత్వ అనుమతులు అవసరమని, కానీ ప్రభుత్వ భూములను ఆక్రమించి వాటిని పట్టా భూములుగా చూపిస్తూ అక్రమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నర్సింగాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 437లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని అక్కడే కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ప్రభుత్వ భూములు రక్షించబడటమే కాకుండా జిల్లాలోని పేద విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఎంపి ధర్మపురి అరవింద్, MLA ఎం సంజయ్ కుమార్లు ఇద్దరి సహకారంతో కేంద్రీయ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు చర్యలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. లేకపోతే కేంద్ర నిధులు వృథా అయ్యే ప్రమాదం ఉందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమము లో సీనియర్ నాయకులూ ACS రాజు ,సిపెల్లి రవీందర్ , లింగంపేట శ్రీనివాస్, కౌన్సిలర్ అరవ లక్ష్మి , అంకర్ సుధాకర్, నరెందుల శ్రీనివాస్ , బాశెట్టి ప్రభాకర్, లింగాల శ్రీకాంత్ రావు , ఠాకూర్ కిషోర్ సింగ్ , ఎడమల వెంకట్ రెడ్డి , పోరండ్ల భిక్షపతి , ఇత్తడి రాజి రెడ్డి , నవ్వోతు సురేశ్ , నాయిని సంజీవ రావు, ఎర్ర శ్రీనివాస్, గోడిశేల నాగరాజు , బుర్ర ప్రమోద్ , బిట్టు , సరేల మహేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.