Take a fresh look at your lifestyle.

ఘనంగా.. శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు

  • ప్రత్యేక పూజలు పాల్గొన్న మాజీ కార్పొరేటర్ పజ్జూరిపావని మణిపాల్ రెడ్డి.

కుషాయిగూడ , ముద్ర విలేఖరి:  ఏ ఎస్ రావు నగర్ డివిజన్ విరాట్ నగర్ కాలనీలో  శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరిగాయి.శుక్రవారం జరిగిన ప్రత్యేక పూజల్లో ఏఎస్ రావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావని మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి మహోత్సవాలను తినిపించారు. ఈ సందర్భంగా పావని రెడ్డి మాట్లాడుతూ..  ప్రజలంతా సుభిక్షంగా ఉండి సకల శుభాలు కలగాలని రేణుక ఎల్లమ్మ అమ్మవారిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో ఎన్ మహేష్, ప్రకాష్, బిశేఖర్ మోడీ, ఉమేష్ చారి, నితీష్ చారి, రాజేష్, కుర్మా రావు, అనిల్ కుమార్ వెంకటేష్, కుమార్, మణికాంత్, నిర్మల, బి.వరమ్మ, కవిత, కుమారి, లలిత, సబిత, వసంత, స్వాతి, ప్రియా, మహిళలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.