Take a fresh look at your lifestyle.

విద్య, వైద్యానికి హబ్ గా మారిన జగిత్యాల… ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

జగిత్యాల జిల్లా కేంద్రం విద్య, వైద్యానికి హబ్ గా మారిందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ పొన్నాల గార్డెన్స్ లో పట్టణానికి చెందిన 55 మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.17,04,500ల విలువగల చెక్కులను, 180 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ పథకం లో భాగంగా మంజూరైన రూ.2.10 కోట్ల విలువగల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్దిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తో కలిసి పనిచేస్తున్నానని, జగిత్యాల ప్రజల మద్దతు ఉన్నదనే నాయకులు నన్ను విమర్శించినా ప్రజలు ఆదరించారన్నారు. రూ.230 కోట్ల తో 230 పడకల నూతన ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం జరిగిందని, మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిటికల్ కేర్ ఆసుపత్రులతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే చెరువులు బాగుంటే ఊరు బాగుంటుందని, పట్టణంలో ఎటు చూసినా అభివ్రుద్ది పనులు జరుగుతున్నాయన్నారు. చింత కుంట, మోతే చెరువు అభివ్రుద్ది కి రూ.3కోట్ల చొప్పున నిధులు మంజూరు అయ్యాయని, పూర్తిగా కలుషితం అయిన ముప్పరపు చెరువు కూడా త్వరలో బాగు చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రూ.60 కోట్ల నిధులు మంజూరు చేయటం తో జగిత్యాల లో అభివ్రుద్ది పనులు సాగుతున్నాయన్నారు. కళ్యాణ లక్ష్మీ షాది ముభారక్, సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ తో నిరుపేదల కు కొంత ఆర్థిక ఉపశమనం లభిస్తుందని అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన అభివ్రుద్ది సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ నూతన పతకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్య ప్రణవ్, ఎమ్మార్వో రామ్మోహన్, AMC ఛైర్మెన్ గడ్డం నారాయణరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ లు గిరి నాగభూషణం, అడువల జ్యోతి లక్ష్మణ్, గోలి శ్రీనివాస్, PCC సెక్రటరీ బండ శంకర్, కో ఆప్షన్ సభ్యులు ముజీభ్ , గట్టు సతీష్, కౌన్సిలర్ లు, కో ఆప్షన్ సభ్యులు, పట్టణ నాయకులు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.