- గోల్కొండ అమ్మవారికి మొదటి బోనం.
- వచ్చే నెల 21 వరకు జాతర ఉత్సవాలు.
- సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం.
ముద్ర, తెలంగాణ బ్యూరో: ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు గురువారం గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మవారికి సమర్పించే మొదటి బోనంతో ప్రారం భం కానున్నాయి.జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కి భక్తులు బోనాలు సమర్పించనున్నారు. జూలై 20న పాతబ స్తీతో పాటు నగరంలో అంగరంగ వైభవంగా బోనాల జాతర ఉత్సవాలు జరగనున్నాయి. జూలై 21న పాతబస్తీలో భక్తిశ్రద్ధలతో అమ్మవారి సామూ హిక ఘటాల ఊరేగింపు, తదనంతరం మారు బోనంతో ఈసారి ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాలకు ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులను ఇప్పటికే మం జూరు చేసింది.కాగా ఈ ఉత్సవాల్లో భాగంగా సప్త మాతృకల-సప్త బంగారు బోనం పూజా కార్యక్రమాలను కన్నుల పండువగా నిర్వహించడానికి భాగ్యనగర్ శ్రీ మహ కాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాల యాల ఊరేగింపు కమిటీ సిద్ధమైంది.ఈసారి బంగారు బోనం ఏడు గుళ్లకు కాకుండా.. కేవలం మూడు దేవాలయాలకు మాత్రమే పరిమి తమవుతోంది. గోల్కొండ జగదాంబ అమ్మవా రితో పాటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, బల్కంపేట ఎల్లమ్మ తల్లికి నిషా క్రాం తి బంగారు బోనాన్ని సమర్పించనుంది. ఇక విజ యవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లికి జోగిని శ్యామల బంగారు బోనాన్ని ఎత్తనుండగా… మరో జోగిని అవికా పెద్దమ్మ తల్లి, చార్మినార్, లాల్ దర్వాజా అమ్మవార్లకు బంగారు బోనాలు ఉమ్మడి దేవాల యాల ఊరేగింపు కమిటీ నిర్వహకుల ద్వారా సమర్పించనున్నారు.
- బంగారు బోనం షెడ్యూల్ ఇలా.
నేడు గోల్కొండ అమ్మవారికి సమర్పించే మొదటి బంగారు బోనంతో ఈసారి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. సప్తమాతృకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగం గా గోల్కొండ ఆ మ్మవారికి మొదటి బోనం సమర్పించనున్నారు.భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరపున శ్రీ జగదాంబికా అమ్మవా రికి పట్టు వస్త్రాలతో పాటు బంగారు పాత్రలో మొదటి బోనాన్ని సమర్పించనున్నారు. 29న విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారికి 2వ బంగారు బోనం.. జులై 2న బల్కంపేట అమ్మవారికి మూడో బంగారు బోసం జూలై 4 న, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి నాలుగో బోనం, జూలై 10న సికింద్రాబాద్ ఉజ్జయిని మహం కాళి అమ్మవారికి 5వ, బంగారు బోనం, 15న చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారికి ఆరో బంగారు బోనం, జూలై 17న లాల్ దర్వాజా సింహ వాహిని అమ్మవారికి చివరి 7వ బంగారు బోనం.