ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంగా జాతీయ రహదారుల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని పార్లమెంట్ సభ్యురాలు డికె అరుణ గురువారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కోరారు.
ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాలమూర ఎంపీ డీకే అరుణ భేటీ అయ్యారు. ఇరిగేషన్ పరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న గద్వాల జిల్లా ప్రాంతంలో ఎర్రవల్లి – గద్వాల్ – రాయచూర్ రహదారి (67 కి.మీ), కొత్తకోట – గద్వాల్ – మంత్రాలయం రహదారి (90 కి.మీ) రెండు గ్రీన్ ఫీల్డ్ రహదారులు ఎంతో అవసరమని పాలమూరు ఎంపీ డికె అరుణ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి తెలియజేస్తూ వెంటనే వాటికి ఆమోదం ఇవ్వాలని వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పాలమూరు ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ… ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాంత అభివృద్ధికి కీలకమైన రెండు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారుల నిర్మాణాలకు డీపీఅర్ మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. ఎర్రవల్లి – గద్వాల్ – రాయచూర్ రహదారి (67 కి.మీ), కొత్తకోట – గద్వాల్ – మంత్రాలయం రహదారి (90 కి.మీ), ఈ రెండు రహాదారులు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతాయని, ఈ రెండు రహదారులు పూర్తి చేస్తే గద్వాల జిల్లాలో పర్యాటకం, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తాయని పేర్కొన్నారు. బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి & మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి వంటి పుణ్యక్షేత్రాలకు భక్తుల సులభ ప్రయాణాలతో పాటు పుష్యక్షేత్రాకు అభివృద్ది చెందుతాయన్నారు.
15 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గకూడా మద్దతు తెలిపారు అని వెంటనే కేంద్రప్రభుత్వం చొరవ తీసుకుని రహదారుల నిర్మాణాలకు డీపీఆర్ అమోదించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఆమె వెల్లడించారు.