Take a fresh look at your lifestyle.

ప్రకృతి వ్యవసాయం పై విద్యార్థులకు అవగాహన.

ముద్ర నడిగూడెం…

మండల పరిధిలోని తెల్లబల్లి గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలోగురువారం ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆ సంస్థ వ్యవస్థాపకులు కిసాన్ సేవా రత్న డాక్టర్ మొలుగూరి గోపయ్య మాట్లాడుతూ మనతో పాటు మన భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు. గత 60 ఏళ్లుగా చేస్తున్న రసాయన వ్యవసాయం తో భూసారం దెబ్బతిన్నదన్నారు. నేల ఆరోగ్యమే పంట ఆరోగ్యం, పంట ఆరోగ్యమే మన ఆరోగ్యమన్నారు. సహజ సిద్ద పద్ధతులతో భూసారం పెంచడం, చీడ పీడల నివారణపై ఎలాంటి పెట్టు బడులు లేకుండా పలు పద్ధతులను విద్యార్థులకు వివరించారు. విద్యార్థి దశ నుండే ప్రకృతి వ్యవసాయం పై అవగాహన ఉండాలన్నారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు సామినేని శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు ఉమా మహేశ్వరరావు, వెంకటరమణ, సైదులు, యాదగిరి, శ్రీహరి, సీతారామయ్య, శ్రీనివాసరావు, రఫీక్ అహ్మద్, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.