ముద్ర, బండ్లగూడ:రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లిలో మారుతి సుజుకి కారు సర్వీసింగ్ సెంటర్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో రెండు కార్లు, పరిసర ప్రాంతాల్లో మంటలు వ్యాపించడంతో, వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ క్రమంలో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. కొంతమేర ఆస్తి నష్టం జరిగిందని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్రభయాందోళనకు గురయ్యారు.ఈ ప్రమాదం షోరూం వెనుక భాగంలో నిల్వ ఉంచిన స్క్రాప్ సామాగ్రి ద్వారా మంటలు చెలరేగి ఉంటాయని, మరిన్ని వివరాలు పూర్తిగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని అగ్నిమాపక అధికారులు తెలిపారు.