Take a fresh look at your lifestyle.

డిమాండ్ల సాధనకు హోరెత్తిన నిరసన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదిక ధర్నా

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల సాధనకు కలెక్టరేట్ ఆధ్వర్యంలో టిజిఇజెఎసి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాలో నిరసనలు హోరెత్తాయి. ఉద్యోగ గజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణలో భాగంగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగ ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో అధిక సంఖ్యలో ఉద్యోగ గెజిటెడ్ అధికారులు ఉపాధ్యాయ, పెన్షనర్లు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. జిల్లా పెన్షనర్ల సంఘం అధ్యక్షులు ఎంసీ లింగన్న, ఎస్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ జిల్లా జె ఏ సి చైర్మన్ వెలమల ప్రభాకర్ లు మాట్లాడుతూ ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రధాన డిమాండ్ లలో 2 వ పిఆర్సి 51 శాతం ఫిట్మెంట్ తో జూన్ 2 లోపు అమలు చేయటం, ఈహెచ్ఎస్ కు సంబంధించి విధివిధానాలు రూపొందించి మే 1 నుండి నగదు రహిత వైద్య సేవలు అందించడం ఉన్నాయి. అలాగే పెండింగ్ లో ఉన్న రూ.13వేల కోట్ల బిల్లులను ఏక మొత్తంలో చెల్లింపు, ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ను రద్దు చేసి ఓపిఎస్ పునరుద్ధరణ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో టి జి జేఏసీ జిల్లా సెక్రటరీ జనరల్ పి.జి రెడ్డి, అడిషనల్ సెక్రెటరీ జనరల్ నరేంద్ర బాబు, కో చైర్మన్ జె. లక్ష్మణ్ నాయకులు డి.రమేష్, కుడాల రవికుమార్, రవికాంత్, శంకర్, విజయ్ కుమార్, దేవేందర్, కృష్ణారావు, హరి ప్రసాద్, మహేంద్ర చారి, సత్యపాల్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, వై అశోక్ కుమార్ హుస్సేన్, బి.రవి తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.