Take a fresh look at your lifestyle.

వర్కింగ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీమ్ పొడిగింపుపై జర్నలిస్టు సంఘాల హర్షం!

 

అమరావతి, ఏప్రిల్ 10:

వర్కింగ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీమ్ ను ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) సహా వివిధ అనుబంధ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
ఆమేరకు ఐజేయూ సెక్రెటరీ జనరల్ డి సోమసుందర్, ఎ.పి.యు.డబ్ల్యు.జే. రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు , ప్రధాన కార్యదర్శి కంచల జయరాజ్, ఎ.పి.ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ, ప్రధాన కార్యదర్శి ఆర్.రామచంద్రరావు, సామ్నా రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు, ప్రధాన కార్యదర్శి సి.హెచ్.వి.రమణారెడ్డి, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విజయభాస్కర్ , ప్రధాన కార్యదర్శి నారాయణ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

“వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ను 2026-2027 వ సంవత్సరానికి పొడిగిస్తూ ఏప్రిల్ పదో తేదీన జీవో ఎం.ఎస్.43 జారీ చేయడం హర్షణీయం.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు వైద్య సేవలు అందించే ఈ పథకం రూపకల్పనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎ.పి.యు.డబ్ల్యు.జే. కీలక భూమిక పోషించింది, ఈ పథకం ద్వారా అక్రెడిటేషన్ కలిగిన జర్నలిస్టుకు, జీవిత భాగస్వామికి, ఇద్దరు పిల్లలకు, జర్నలిస్టుపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆస్పత్రిలో చేరిన ప్రతిసారీ రెండు లక్షల రూపాయల మేరకు క్యాష్ లెస్ చికిత్స అందుతుంది” అని యూనియన్ నాయకులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇటీవల విజయవాడలో జరిగిన ఐ.జే.యు. 11 వ ప్లీనరీ వేదికపై ఈ పథకాన్ని కొనసాగిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈసందర్భంగా వారు గుర్తు చేశారు.
గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి జీవోను ప్రతి ఏటా అక్టోబర్, నవంబర్, నెలల వరకూ విడుదల చేయకుండా జాప్యం చేయడంతో పలువురు పాత్రికేయులు అప్పట్లో ఇబ్బందులు పడ్డారని, మార్చి 31 వ తేదీన గడువు ముగిసిన ఈ పథకాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం కేవలం పది రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని వారు పేర్కొన్నారు.
ఈ పధకం అమలులో నెట్ వర్క్ ఆస్పత్రుల నుండి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రైపాక్షిక కమిటీలో జర్నలిస్టు సంఘం ప్రతినిధికి కూడా స్థానం కల్పించాలని, వైద్యసేవల మెరుగుదలకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వారా ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.