ముద్ర, నారాయణపేట:
విద్యార్థులు మంచి పౌరులుగా ఎదగాలంటే విద్యతో పాటు నైతిక విలువలు కూడా అవసరమని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఉట్కూరు మండలంలో ఎస్ . సి.బాలుర వసతి గృహాన్ని మంగళవారం కలెక్టర్ ఎస్పీ వినీత్ కుమార్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, శారీరక మరియు మానసిక ఆరోగ్యం కోసం క్రీడలు ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వసతి గృహాల్లో అన్ని మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. పరిశుభ్రత, క్రమశిక్షణ, సమయపాలన ప్రతి విద్యార్థి జీవితంలో కీలకమని పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ క్రమశిక్షణతో జీవనం గడిపితే జీవితంలో విజయాలు సాధించవచ్చని చెప్పారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్పంచ్ రేణుక, ఈ.డి.ఎస్.సి.కార్పొరేషన్ అబ్దుల్ ఖలీల్, తహసీల్దార్ రవి తదితరులు పాల్గొన్నారు.