మహదేవపూర్, ముద్ర:
ఈరోజు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న టీపీసీసీ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు గారు ముందుగా వారికి రాజగోపురం వద్ద నుండి ఆలయ సాంప్రదాయాలతో మర్యాదపూర్వక స్వాగతం పలికి అనంతరం స్వామివారికి అభిషేకం అమ్మవారి ఆలయంలో దర్శనం అనంతరం ఆలయ చైర్మన్ మోహన్ శర్మగారు స్వామివారి శేష వస్త్రాలతో సన్మానించిన అనంతరం అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించడం జరిగినది ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా డిసిసి ప్రెసిడెంట్ కరుణాకర్ గారు ఆలయ ఈవో ఎస్ మహేష్ గారు గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి గారు ఆలయ ధర్మకర్తలు పాల్గొనడం జరిగినది.