ముద్ర ప్రతినిధి మెదక్:
బాబు జగజ్జీవన్ రాం దేశానికి అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన త్యాగాలు, సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.
ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక భూపతి రాజు, అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్డిఓ శ్రీనివాసరావు, పిఆర్టీయూ మెదక్ జిల్లా అధ్యక్షులు మేడి సతీష్ రావు, ప్రధాన కార్యదర్శి సామ్య నాయక్, రాష్ట్ర జిల్లా మండల బాధ్యులు మహేష్ కుమార్, చంద్రశేఖర్, సంతోష్, వీరేశం, తదితరులు పాల్గొన్నారు

కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ నగేష్
మానవతావాది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమతావాది డాక్టర్ బాబూ జగజ్జివన్ రామ్ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించే లక్ష్యంతో ముందుకుపోవాలని అదనపు కలెక్టర్ నగేష్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ లో జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబూ జగజ్జివన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా నివాళులర్పించారు.

బాబూ జగజ్జివన్ రామ్ జయంతి వేడుకల సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ఆటపాటలతో పండుగ వాతావరణం కల్పించారు.
ఈ సందర్భంగా అదరపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న రిజర్వేషన్లతో విద్యలో రాణించాలని, విద్యతోనే ఏదైనా సాధ్యపడుతుందని పిలుపునిచ్చారు. మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక భూపతి రాజు స్వయంగా బాబూ జగజ్జివన్ రామ్ జీవిత చరిత్రను తమ కవితల ద్వారా తెలియజేశారు. బాబూ జగజ్జివన్ రామ్ విగ్రహా ఏర్పాటులో స్థానిక మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావుతో సంప్రదించి చర్యలు చేపడతామన్నారు.
ఎస్సీ సామాజిక వర్గ మండల స్థాయి నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ లక్ష్మణ్ బాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిఎస్పి ప్రసన్నకుమార్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్, కార్యదర్శి రాజ్ కుమార్,ఉత్సవ కమిటీ చైర్మన్ డి. సంజీవ్, వైస్ చైర్మన్ జి. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, ఎమ్మార్పీఎస్ బాలరాజు, సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో
జిల్లా పోలీసు కార్యాలయంలో చిత్రపటానికి బాబు జగ్జీవన్ రాం చిత్రపటానికి పూలమాల వేసి ఏఆర్ డీఎస్పీ రంగా నాథ్ నివాళులు అర్పించారు. యువతకు స్ఫూర్తిగా నిలిచేలా ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేసిన గొప్ప నాయకుడు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ శైలేందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో
బాబూ జగ్జీవన్‌రాం ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్ పేర్కొన్నారు.ఆదివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం వద్ద బాబూ జగ్జీవన్‌రామ్ 119వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటాలకు మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పట్టణ పార్టీ అధ్యక్షులు ఎం. గంగాధర్, మున్సిపల్ కౌన్సిలర్ లు తొడుపునూరి శివరామకృష్ణ, బుజరంపేట అరుణ సిద్ధిరాములు, ఎరుకల నర్సింలు, ఎండి. మన్సూర్ అహ్మద్, నాయకులు కొరివి రాములు, గోదల సాయిరాం, ప్రవీణ్ గౌడ్, సయ్యద్ ఉమర్, ప్రవీణ్, దేవుల నాయక్, స్వరూప, బాలరాజు యాదవ్, నాగరాజు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.