Take a fresh look at your lifestyle.

ఢిల్లీకి మూటలు మోసేందుకే పని కొస్తాడు- సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి బండి ఆరోపణలు

ఓవైసీ కళ్లలో ఆనందం కోసమే జీహెచ్ఎంసీ ముక్కలు
సనాతన ధర్మంపై, హిందూ దేవాలయాలపై దాడులను తిప్పికొడదాం

ముద్ర, తెలంగాణ బ్యూరో :

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు మోయడానికి తప్ప దేనికి పనికిరారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ప్రజా సమస్యలను గాలికి వదలేసిన సీఎం ఎంఐఎంతో దోస్తీలో మునిగి తేలుతున్నారని విమర్శించారు. కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కార్పొరేటర్లతో కలిసి మంగళవారం ఆయన పాతబస్తి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. మా దేవాలయాలను కాపాడండి అంటూ మెజారిటీ హిందూ సమాజం బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే పనికిమాలిన విమర్శలను పట్టించుకోవద్దని బీజేపీ శ్రేణులకు సూచించారు. సనాతన ధర్మంపై, హిందూ దేవాలయాలపై దాడులను తిప్పికొట్టేందుకు మళ్లీ యుద్ధం మొదలుపెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. ధర్మ రక్షణకై సమర శంఖం పూరిద్దామన్న బండి సంజయ్… కాషాయ జెండా పట్టుకొని తరలిరాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పారు. ఓవైసీ కళ్లలో ఆనందం కోసమే జీహెచ్ఎంసీని మూడు ముక్కులు చేశారని రేవంత్ రెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. . రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎం బూట్లు నాకుతూ బతుకుతున్నాయని ఇది ఓ బతుకేనా అని ప్రశ్నించారు. ఈ రెండు పార్టీల్లో ఉన్న హిందూ నాయకులు ఆలోచించుకోవాలని సూచించారు. తాను ఎవరిని రెచ్చగొట్టడం లేదని వాస్తవాలు చెబుతున్నానన్నారు.రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నగర ప్రజలు కాంగ్రెస్, ఎంఐఎంకు బుద్ధిచెబుతారని జోస్యం చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామన్నారు. రాష్ట్రంలో హిందూ ధర్మం పరిరక్షణ కోసం పని చేస్తున్నామన్నారు కెబినెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై చర్చ జరగడం లేదని విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.