Take a fresh look at your lifestyle.

సామాజిక తెలంగాణనే మా ధ్యేయం-నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్

 

– ఏప్రిల్ 8న తెలంగాణ జాగృతిలో చేరికకు ముహూర్తం ఖరారు.

ముద్ర, గద్వాల:

నడిగడ్డ హక్కుల పోరాట సమితి వేదికగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, సమస్యల పరిష్కారం దిశగా నడిగడ్డలో ఉద్యమాన్ని కొనసాగిస్తూ,అన్యాయాలను అరికట్టి ప్రజా శ్రేయస్సుకై ప్రశ్నించే గొంతుకగా నడిగడ్డ ప్రజల తరఫున అనేక సమస్యలపై గళం విప్పుతున్నామని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ తెలిపారు. శుక్రవారం గద్వాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

ఏప్రిల్ 8వ తేదీన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు

గత 2014 సంవత్సరం నుండి నేటి వరకు నడిగడ్డ ప్రాంత సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ, ఈ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ, బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి, నడిగడ్డ హక్కుల పోరాట సమితి వేదికగా పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు.
మా పోరాటాన్ని మెచ్చి మా శ్రేయస్సు కోరేవారు మరియు నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు కార్యకర్తలు అందరి అభిష్టం మేరకు తెలంగాణ సామాజిక న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో అందరి సమష్టి మేరకు రాజకీయ పార్టీలో వారితో పాటు తాము కూడా తెలంగాణ జాగృతిలో భాగస్వాములై పోరాటం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

ఏప్రిల్ 25 తేదీన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నారని, సామాజిక న్యాయమే ధ్యేయంగా బడుగు,బలహీన వర్గాల కోసం తెలంగాణలో త్వరలోనే ఉద్యమ పార్టీగా అతి పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నారని తెలిపారు.
ఏప్రిల్ 8వ తేదీన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో చేరుతున్నామని, నడిగడ్డలోని జిల్లా మరియు నియోజకవర్గ ప్రజల మన్ననలు మరియు ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు జిల్లా కార్యదర్శి లవన్న,జిల్లా నాయకులు వెంకట్రాములు, రంగస్వామి, ధరూర్,మల్దకల్,గట్టు మండలాల అధ్యక్షులు నెట్టెంపాడు గోవిందు, విష్ణు,బలరాం నాయుడు, మండల ఉపాధ్యక్షులు ప్రేమ్ రాజ్,మునెప్ప, మల్దకల్, అడివి ఆంజనేయులు, నజుముల్లా, మండల కార్యదర్శులు రాము, దయాకర్, ఉప్పరి కృష్ణ, మండల ముఖ్య నాయకులు గోపాల్, లక్ష్మన్న, దొడ్డన్న, విజయ్, వెంకటేష్, కేపీ రామక్రిష్ణ, చిన్న రాముడు, సర్వేశ్, భూపతి నాయుడు,సామెల్, స్వామి,ఆశన్న, నరసింహ, మరియు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.