Take a fresh look at your lifestyle.

ఫోర్త్ సిటీతో పాటు మహేశ్వరంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం

  • లెన్స్ కార్ట్ యూనిట్ ఏర్పాటుతో మహేశ్వరం బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది
  • రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
  • మహేశ్వరం నియోజకవర్గంలో డీసీపీ కార్యాలయ భవనం, ఇతర 12 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు

ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి : ఫోర్త్ సిటీతో పాటు మహేశ్వరం నియోజకవర్గంలో వచ్చే ప్రతీ పరిశ్రమలో స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తామని రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ,జిల్లా ఇంచార్జీ మంత్రి దుద్దీళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో DCP కార్యాలయం, లెన్స్ కార్ట్ పరిశ్రమ నిర్మాణానికి రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ, జిల్లా ఇంచార్జీ మంత్రి శ్రీధర్ బాబు భూమి పూజ చేశారు. అనంతరం మహేశ్వరం,కందుకూరు మండలాల్లో రూ.12 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,లెన్స్ కార్ట్ పరిశ్రమ ఏర్పాటుతో మహేశ్వరం నియోజకవర్గం బ్రాండ్ ఇమేజ్ మరింత పెరగనుందన్నారు.లెన్స్ కార్ట్ పరిశ్రమ ఏర్పాటుకు ఇదే నియోజకవర్గంలో రావిర్యాలలో 52 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు.ఇక్కడ రూ.1500 కోట్ల పెట్టుబడితో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించే కళ్ల అద్దాల పరిశ్రమలో 1500 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.పరిశ్రమల ఏర్పాటుకు భూములిచ్చిన రైతన్నలకు ఫ్లాట్లు,పరిహారం, ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్ పట్నం మహేందర్ రెడ్డి,రాష్ట్ర పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ చల్లా నర్సింహా రెడ్డి,జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి,మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి,స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.