Take a fresh look at your lifestyle.

తెలంగాణలో రూ.84.15 కోట్ల జీఎస్టీ కుంభకోణం ఎస్‌కేజీ ట్రేడింగ్‌ కంపెనీ ప్రొప్రైటర్‌, రిమాండ్

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ భారీ జీఎస్టీ కుంభకోణాన్ని బయటపెట్టింది. సుమారు రూ.84.15 కోట్ల విలువైన ఐటీసీ మోసం జరిగినట్లు గుర్తించింది. ఇందులో ప్రధాన నిందితుడు, ఎస్‌కేజీ ట్రేడింగ్‌ కంపెనీ ప్రొప్రైటర్‌ సందీప్‌ను అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడు నకిలీ ఇన్వాయిస్‌ల ద్వారా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పొందినట్లు గుర్తించారు. సందీప్‌కు సంబంధమున్న ఇతర సంస్థల్లోనూ అక్రమాలు జరిగినట్లు తేలింది. ఈక్రమంలో వాటి రిజిస్ట్రేషన్లను అధికారులు రద్దు చేశారు. సందీప్‌ను జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

Leave A Reply

Your email address will not be published.