సంఘాల బలోపేతానికి కృషి మత్స్యకారులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం టీజీఎఫ్‌సీఓ ఫెడరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థిక బలోపేతానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని టీజీఎఫ్‌సీఓ ఫెడరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని గంగాపుత్ర సంఘం, సబ్జీమండిలో ఐదు సొసైటీలకు చెందిన 280 మంది సభ్యులకు “మత్స్యకారుల కోసం సుస్థిర జీవనోపాధి కార్యక్రమం” పై ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘాల బలోపేతానికి ఆర్థిక చేయుతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమంలో అనేక అంశాలపై సంబంధిత శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఛైర్మన్ శిక్షణా మాన్యువల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్‌ఓ డాక్టర్ రజిని, సొసైటీ సభ్యులు , సిబ్బంది పాల్గొన్నారు.