Take a fresh look at your lifestyle.

ఆధునిక పంటల సాగుతో రైతులకు ప్రయోజనం కలెక్టర్ అభిలాష అభినవ్

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రైతులకు ఆధునిక పంటల సాగుతో ప్రయోజనం ఉంటుందని, అధికారులు వారిని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు.
వ్యవసాయ శాఖ అధికారులతో గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయం లాభసాటిగా మారేలా అధికారులు చేయూతనివ్వాలన్నారు. పంట మార్పిడి అలవాటు చేయాలని తెలిపారు. సహజ ఎరువుల వాడకం పెంచేలా కృషి చేయాలన్నారు. భూసార పరీక్షలు నిర్వహిస్తూ మోతాదుకు మించిన ఎరువుల వాడకం వల్ల కలిగే నష్టాలపై రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని వివరించారు. క్షేత్ర స్థాయిలో మండల వ్యవసాయ అధికారులు ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. జిల్లాలో ఆయిల్ పామ్ పంటల సాగు విస్తీర్ణం మరింత పెంచాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, ఎడిఎ లు విద్యాసాగర్, శ్రీనివాస రాజు, సుజాత, వీణ, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.