Take a fresh look at your lifestyle.

కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలును వేగవంతంగా చేపట్టాలి

  • తరుగు పేరుతో రైతులకు ఇబ్బందులు పెట్టవద్దు.
  • కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.

ముద్ర,పానుగల్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలును వేగవంతంగా చేపట్టాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం పానగల్ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యాన్ని నిబంధనల పేరిట రైతులకు ఇబ్బందులకు గురి చేస్తూన్నారని, ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు.తరుగు పేరుతో ఒక సంచికి ఒక కిలో తరుగు తీస్తున్నరని తరుగు తీయకుండా కొనుగోలు చేసి వెంటనే ధాన్యంను తరలించాలన్నారు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు నిరీక్షణ తప్పడం లేదని ఆయన అన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదని కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ నాయక్,రైతు బంధు మండల మాజీ కో ఆర్డినేటర్ వెంకటయ్య నాయుడు,బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు జ్యోతినందన్ రెడ్డి, మండల నాయకులు వీర సాగర్, చిక్కేపల్లి నరసింహ, బండి సరోజమ్మ, ప్రవీణ్ రెడ్డి,రాంబాబు నాయక్, ఆది హనుమంతు,నవీన్ రెడ్డి, సాయిలు, కొండల్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.