Take a fresh look at your lifestyle.

మృతుల కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్యే కుంభం

ముద్ర, ప్రతినిధి భువనగిరి :

మండలంలో బిఎన్ తిమ్మాపురంలో గ్రామస్థులు డొంకేన కేతమ్మ, డొంకేన నరేష్ గౌడ్, దొంకేన సురేష్ గౌడ్ లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి సమాచారంతో మంగళవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మృతులకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా తన వంతుగా వారికి తక్షణ సహాయంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోవడం చాలా బాధాకరమని వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.