Take a fresh look at your lifestyle.

ఎస్ ఎల్ బి సి మరణాలు ప్రభుత్వ హత్యలే… బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఎస్ ఎల్ బి సి టన్నెల్ మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.నాగర్ కర్నూల్ టన్నెల్ ఘటనా స్థలానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి నాగర్ కర్నూల్ ఎస్ ఎల్ బి సి టన్నెల్ కు బీజేపీ ఎమ్మెల్యేలు బయలుదేరారు.ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ టన్నెల్ లో కార్మికుల మృతికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని మండి పడ్డారు.ఇవి ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ హత్యలే నని ఆరోపించారు.ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా రేవంత్ రెడ్డి క్షేత్ర స్థాయిలో ఘటన స్థలాన్ని పరిశీలించకపోవడం పట్ల మండిపడ్డారు.ఈ ఘటనలో కనీసం మానవతా దృక్పథాన్ని కూడా చూపక పోవటం రేవంత్ రెడ్డి బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం అన్నారు.

Leave A Reply

Your email address will not be published.