ముద్ర కూకట్‌పల్లి :
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిపిఐ చేపట్టిన ‘ఇంటింటికీ సిపిఐ’ కార్యక్రమం రెండో రోజు జగద్గిరిగుట్టలోని బీరప్ప నగర్, దేవమ్మ బస్తీల్లో ఉత్సాహంగా సాగింది. పార్టీ నాయకులు గల్లీగల్లీ తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దున్నేవానికే భూమి’ నినాదంతో లక్షలాది ఎకరాలను పేదలకు పంచిన చరిత్ర సిపిఐది. నేటి జగద్గిరిగుట్ట సిపిఐ పాతిన ఎర్రజెండాలు, వేయించిన గుడిసెల ఫలితమేనని నేతలు గుర్తుచేశారు. వివిధ రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్న జగద్గిరిగుట్ట అభివృద్ధిలో సిపిఐ పోరాటాల పాత్ర కీలకమని కొనియాడారు. కొత్త తరానికి పార్టీ చరిత్రను వివరిస్తూ, బస్తీల్లో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా తమ సమస్యలను పార్టీ దృష్టికి తీసుకురావాలని, భవిష్యత్తులో మరిన్ని పోరాటాల ద్వారా వాటిని పరిష్కరిస్తామని నేతలు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్, రాష్ట్ర సమితి సభ్యులు ఏసురత్నం, మండల కార్యదర్శి కే స్వామి, హైమావతి, హరినాథ్, బాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.