నారాయణపేట పట్టణాన్ని పార్టీలకతీతంగా కౌన్సిలర్లతో కలిసి అభివృద్ధి చేస్తాం- పేట మున్సిపల్ చైర్ పర్సన్ కొండా శ్వేత సత్య యాదవ్
పేట 21, 22 వార్డులలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం
ముద్ర, నారాయణపేట:
నారాయణపేట పట్టణాన్ని పార్టీలకతీతంగా కౌన్సిలర్లతో కలిసి సమిష్టిగా అభివృద్ధి చేస్తామని పేట మున్సిపల్ చైర్ పర్సన్ కొండా శ్వేత సత్య యాదవ్ అన్నారు. పట్టణంలోని
21, 22 వార్డులలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఆయా వార్డుల కౌన్సిలర్లు కమలాపూర్ ప్రభాకర్, రాజు ఘాట్ ఆధ్వర్యంలో శనివారం కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా 21 వ వార్డు పరిధిలోని గోపాల్ పేట…. దూల్పేట్…. బురుడు వాడిలో నెలకొన్న ప్రధాన సమస్యలను కౌన్సిలర్ కమలాపూర్ ప్రభాకర్ చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. వార్డులో మహిళ టాయిలెట్లకు సంబంధించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. వీధి దీపాలను ఏర్పాటు చేయాలని కోరారు. శానిటేషన్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి ఎప్పటికప్పుడు పరిశుభ్రత ఉండేలా చూడాలన్నారు. మంచినీటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. వైస్ చైర్మన్ మంజుల రాఘవేందర్ రెడ్డి, కమిషనర్ గోల్కొండ నరసయ్య, ఇంజనీర్ మహేష్ తో పాటు జవాన్ నరేష్ తదితరులు ఉన్నారు.