Take a fresh look at your lifestyle.

నాగర్ కర్నూల్‌లో రెండో రోజు కొనసాగుతున్న విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లాలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మె బాట పట్టారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈ ఆందోళన కొనసాగుతుండగా, దాదాపు 2000 మందికి పైగా ఆర్టిజన్ కార్మికులు పాల్గొన్నారు. ఆర్టిజన్, స్పాట్ బిల్లర్, పీస్ రేట్, అన్‌మ్యాన్ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు.
విద్యుత్ కార్మిక సంఘాల 9 జేఏసీ ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరుగుతోంది. ఆర్టిజన్ కార్మికులకు APSEB రూల్స్ వర్తింపజేయాలని, ఇతర కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.