ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న ఈద్గా వద్ద మరియు చన్ గెస్ పూర్ రోడ్డు మార్గంలో ఉన్న పెద్ద దర్గా వద్ద తాండూర్ పట్టణ ముస్లిం సోదరులతో పాటు సామూహిక ప్రార్ధనలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ముస్లిం సోదరులను అలింగణం చేసుకుంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పట్టణంలోని స్మశాన వాటిక లకు, మసీదులకు, దర్గాల అభివృద్ధి కోసం దాదాపుగా 85 లక్షల రూపాయలను కేటాయించడం జరిగిందని, త్వరితగతిన ఈ యొక్క పనులను ప్రారంభించడం జరుగుతుందని వారు తెలిపారు. రంజాన్ పండుగ ప్రశాంతంగా జరపడంలో సహకరించిన మున్సిపల్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి ముస్లిం సోదరులు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, యువకులు, వివిధ పార్టీల కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.