- ప్రజాస్వామ్య రక్షణకే జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్, యాత్ర.
- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.
ముద్ర, వీపనగండ్ల: ప్రజాస్వామ్య రక్షణకే జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్, యాత్ర చేపట్టినట్లు రాష్ట్ర ఎక్సైజ్ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం వీపనగండ్ల సంగినేనిపల్లి గ్రామాలలో ప్రజాస్వామ్య రక్షణకే జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు, ముందుగా ఆయా గ్రామాల్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. జ్యోతిరావు పూలే, బాబు జగజీవన్ రాయి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యం గా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్రే జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్, యాత్ర అని అన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేద్కర్, మహత్మా గాంధీ, జ్యోతి బాయ్ పూలే, లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంధమే భారత రాజ్యాంగం అని వివరించారు. స్వాతంత్రానికి ముందు ఆంగ్లేయులు భారతదేశాన్ని వశపరచుకొని పరిపాలించడం జరిగిందని అలాంటి ఆంగ్లేయుల పాలను ఎదిరించి తరిమికొట్టిన మహాత్మా గాంధీ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. శాంతియుత మార్గంలో దేశాన్ని సమన్వయపరిచి ఆంగ్లేయుల పాలను దేశం నుంచి తరిమి కొట్టి భారతదేశానికి స్వాతంత్ర విముక్తి కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీలు రాజ్యాంగ పరిరక్షణకు శాంతి భద్రతలకు శాంతి మార్గాలకు అడ్డుపడుతున్నాయని ఇటువంటి పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. సంగినేనిపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని నెలకొల్పటానికి తనవంతుగా 10 వేల రూపాయలు విరాళంగా అందిస్తానని గ్రామంలోని ప్రతి ఒక్కరు సహకరించి గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడం జరిగిందని అన్నారు.కార్యక్రమంలో వీపనగండ్ల చిన్నంబాయి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోదల బీరయ్య, చంద్రశేఖర్ యాదవ్, వనపర్తి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్ , జిల్లా ఎంపిటిసిల ఫారం మాజీ అధ్యక్షులు ఇంద్రకంటి వెంకటేష్, కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పిటిసి కృష్ణ ప్రసాద్ యాదవ్, పానగల్ సింగిల్విండో మాజీ అధ్యక్షులు బాల్ రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నారాయణరెడ్డి, ఎత్తం కృష్ణయ్య, మాజీ సర్పంచ్ గంగిరెడ్డి, నాయకులు సుదర్శన్ రెడ్డి, చిన్నారెడ్డి, ధనుంజయ, రామిరెడ్డి, రవీందర్ రెడ్డి, గోపాల్ నాయక్, బసవరాజ్ గౌడ్, గోపి, మహేష్, భరత్ రెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
