Take a fresh look at your lifestyle.

నక్సలిజం సామాజిక సమస్య

  • కాంగ్రెస్​ శాంతిభద్రతల అంశంగా పరిగణించదు
  • గతంలో జానారెడ్డి నక్సలైట్లతో చర్చలు జరిపారు
  • ఆయన సలహాలు, సూచనలు, మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
  • శాంతి చర్చల కమిటీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో : దేశాన్ని పట్టిపీడిస్తోన్న నక్సలిజాన్ని కాంగ్రెస్​ ప్రభుత్వం ఓ సామాజిక సమస్యగా భావిస్తోందని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు.అంతే తప్ప శాంతిభద్రతల అంశంగా పరిగణించడం లేదన్నారు.నక్సలిజం కార్యకలాపాలు సమాజ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు.ఛత్తీస్​ గడ్​, తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టపై జరుగుతోన్న కేంద్ర సాయుధ బలగాల కూంబింగ్​ ను నిలిపివేసేలా మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని శాంతి చర్చల కమిటీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. ఆదివారం జూబ్లీహీల్స్ లోని ఆయన నివాసంలో సీఎంతో భేటీ అయిన శాంతి చర్చల కమిటీ నేతలు కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు.ఈ మేరకు కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్ సీఎం రేవంత్​ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం.. కమిటీ సభ్యులతో మాట్లాడారు.గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన ఘనత కాంగ్రెస్​ కు మాత్రమే దక్కిందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. చర్చల్లో పాల్గొన్న అనుభవం సీనియర్​ నేత జానారెడ్డికి ఉందన్నారు. కమిటీ సభ్యుల విన్నపం మేరకు ఈ అంశంపై జానారెడ్డి సలహాలు , సూచనలు తీసుకుంటామని చెప్పారు.తర్వాత మంత్రులతో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని కమిటీ సభ్యులకు సీఎం హామీ ఇచ్చారు.
ఇదీలావుంటే.. ఛత్తీస్​ గడ్​, తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టను చుట్టుముట్టిన కేంద్ర సాయుధ బలగాలు గత ఐదు రోజులుగా బాంబుల దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో ఇప్పటికే 32 మంది మావోయిస్టులు మృతి చెందారు.ఈ క్రమంలో భద్రత బలగాల కూంబింగ్ ను తక్షణమే నిలిపివేయాలని మూడు రోజుల క్రితమే మావోయిస్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.సాయుధ బలగాలు వేల సంఖ్యలో కర్రిగుట్టలను చుట్టు ముట్టడంతో అక్కడ యుద్ధవాతావరణం కనిపిస్తోందని పేర్కొన్నారు.ఈ క్రమంలో కర్రిగుట్ట ఆపరేషన్ వెంటనే ఆపి శాంతి చర్చలకు ముందుకురావాలంటూ మూడు రోజుల క్రితమే బస్తర్ మావోయిస్టు ఇన్ చార్జి రూపేశ్ పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు. శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నారని చెప్పారు.ఇందుకు తమ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. శాంతి చర్చల విషంలో మా పార్టీ కేంద్ర కమిటీ ఇప్పటికే లేఖలు కూడా జారీ చేసిందని చర్చల విషయంలో మా వైపు నుంచి నిరంతర ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయన్నారు.అయితే ప్రభుత్వ ఉద్దేశం వేరేలా కనిపిస్తోందని చర్చల ద్వారా సమస్య పరిష్కిరించే అవకాశం ఉన్నప్పటికీ అణిచివేత, హింసాకాండ ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.బీజాపూర్-తెలంగాణ సరిహద్దులో భారీ సైనిక ఆపరేషన్ ప్రారంభమైందనీ వెంటనే ఈ ఆపరేషన్ ఆపి బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.చర్చల కోసం అనుకూల వాతావరణం కల్పించాలన్నారు.ఆపరేషన్ కగార్​ నెల రోజుల పాటు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

Leave A Reply

Your email address will not be published.