హైదరాబాద్: ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్సీసీ) మీడియా, వెబ్‌సైట్, న్యూస్‌లెటర్ సబ్ కమిటీ చైర్మన్‌గా ప్రముఖ జర్నలిస్టు కె. సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ఎఫ్ఎన్సీసీ మేనేజ్‌మెంట్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్న కె. సత్యనారాయణకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడు కె.ఎస్. రామారావు, సెక్రటరీ ముళ్లపూడి మోహన్ అధికారికంగా నియామక ఉత్తర్వులు జారీ చేశారు. మీడియా, వెబ్‌సైట్, మాసపత్రిక న్యూస్‌లెటర్ ద్వారా సంస్థ సమాచారాన్ని మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడంతో పాటు, ఎఫ్ఎన్సీసీ ప్రతిష్ఠను పెంపొందించే దిశగా ఆయన సూచనలు, భాగస్వామ్యం అందించాలని మేనేజ్‌మెంట్ కమిటీ ఆకాంక్షించింది.
ఈ నియామకంపై పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. కె. సత్యనారాయణకు అభినందనలు తెలియజేస్తూ ఆయన నాయకత్వంలో ఎఫ్ఎన్సీసీ మీడియా విభాగం మరింత క్రియాశీలకంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.