భువనగిరి, ముద్ర ప్రతినిధి
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటోగ్రఫీ పోటీల్లో ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా రాష్ట్ర స్థాయి ద్వితీయ బహుమతి ని కొల్లోజు శివ కుమార్ అందుకున్నారు. శనివారం హైటెక్ సిటీలోని శిల్పారామం లో జరిగిన కార్యక్రమంలో టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మెన్ దిల్ రాజు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ఐ ఏ ఎస్, వల్లూరి క్రాంతి ఐఏఎస్ టూరిజం శాఖ డైరెక్టర్, సెక్రటరీ చేతుల మీదుగా కొల్లోజు శివ కుమార్ అవార్డు అందుకున్నారు.