కోరుట్ల, ముద్ర :-ముద్ర పత్రిక క్యాలెండర్ ను ఆర్డీవో జివాకర్ రెడ్డి సోమవారం రోజు తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ వాస్తవాలను వెలికితీయడంలో, ముద్ర పత్రిక తనదైన శైలిలో ముందుకు దుసుకెళ్తుందని అన్నారు. వార్తలను, ప్రభుత్వ పథకాలను, ప్రజలకు అర్థమయ్యేలా ఎప్పటికప్పుడు పత్రికా రూపంలో ముందుకు సమాచారాన్ని అందిస్తుందని, ప్రజా సమస్యలను ఎల్లప్పుడూ తమ పత్రికలలో రాస్తూ ప్రజా సమస్యలను పరిష్కారం చేసేలా అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు ఒక వారధిలా పత్రికలు పనిచేస్తున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ముద్ర పాత్రికేయులు గుడిసె కోటేశ్వర్, టీయుడబ్ల్యూజె (ఐజెయు) కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బట్టు హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి చలిగంటి వినోద్, జిల్లా సంయుక్త కార్యదర్శి అల్లె రాము, పాత్రికేయులు కొండ్లేపు అర్జున్, లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.