Take a fresh look at your lifestyle.

ఘనంగా శంకర జయంతి

మంథని, ముద్ర విలేకరి: భారతదేశంలో సనాతన ధర్మాన్ని గురించి ప్రబోధించిన శ్రీ ఆది శంకరాచార్యుల జయంతి ఉత్సవాలు మంథని లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.స్థానిక శ్రీ శీలేశ్వర, సిద్దేశ్వర స్వామి దేవాలయంలోని శ్రీ ఆది శంకరాచార్యుల ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.గత ఐదు రోజులుగా స్వామివారికి నిత్య రుద్రాభిషేకం నిర్వహిస్తూ భక్తులు శ్రీ సూక్తం, నమ్మకం చమకం, భజన కార్యక్రమాలు నిర్వహించారు.అలాగే సాయంత్రం మంథని పట్టణ పురవీల గుండా భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.