ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన అనిత నేషనల్ లెజెండరీ ఎక్సలెన్స్ అవార్డు పొందారు. భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ మరియు ఎన్జీవోస్ నెట్ వర్క్(భారత్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్టసేవలందించిన మహిళామణులకు అందజేసే నేషనల్ లెజెండరీ ఎక్సలెన్స్ అవార్డు ను జగిత్యాల కు చెందిన ప్రముఖ కవయిత్రి,రచయిత్రి అయిత అనిత హైదరాబాదులో సంస్థ చైర్మన్ డా.బిక్కికృష్ణ, సినీనిర్మాత కంఠంనేని రవిశంకర్,ఎన్జీవోస్ నెట్వర్క్ నేషనల్ డైరెక్టర్ రావి దేవికాచౌదరి లచే స్వీకరించారు.అనితను సాహితీ వేత్తలు,కళాశ్రీ అధినేత గుండేటి రాజు, కవయిత్రులు మద్దెల సరోజన, లక్కారాజు శ్రీలక్ష్మి, ములస్తం లావణ్య, ఓదెల గంగాధర్, మాడిశెట్టి శ్రీనివాస్ తదితరులు అభినందించారు.